మోడల్ స్కూల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

మోడల్ స్కూల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై రవీందర్
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
మోడల్ స్కూల్ మహేశ్వరంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్,సైబర్ నేరాల పైన అవగాహన కల్పించడం జరిగింది.ప్రస్తుత రోజులలో విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారి మత్తులో పడి వారి యొక్క జీవితాలను కోల్పోతున్నారు. ఇంటర్నెట్ గేమ్స్ పట్ల ఆసక్తి పెంచుకొని ఆన్లైన్ గేమ్స్ ఆడటం ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు డబ్బులను కోల్పోవడం జరుగుతుందని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవీందర్ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ చెడు అలవాట్లకు గురికాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మంచి మార్గంలో నడిచి మంచిగా చదువుకోవాలని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ధనుంజయ్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.