కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- కార్మికులకు కొండంత అండగా ఉంటా
- ఓట్ల కోసం ఆరు గ్యారంటీల అమలు పేరుతో నిండా ముంచిన కాంగ్రెస్ ఓడించాలి
- ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఆర్థిక సాయం ఇస్తానన్న హామీ అమలు చేసేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
- కార్మికుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించి వారీ ఆరోగ్యాల్ని కాపడుతాం
జ్ఞానతెలంగాణ, నాగర్ కర్నూల్:
కార్మికులు,కర్షకులు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి, కార్మికులకు న్యాయం చేస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.మేడే సందర్భంగా వనపర్తిలోని రాజీవ్ చౌక్ లో భవన నిర్మాణం, ఆటో, హమాలీ,ఆటో డ్రైవర్స్,స్ర్టీట్ వెండర్స్, రైతు కూలీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు ఐక్యతతో ఉండాలని,తనను ఎంపీగా గెలిపిస్తే కార్మికుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఓట్ల కోసం ఆరు గ్యారంటీల అమలు పేరుతో నిండా ముంచిన కాంగ్రెస్ ను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులకు అధికారం రాగానే జనాలను మోసం చేసే పనిలో ఉన్నారన్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఆర్థిక సాయం ఇస్తానన్న హామీ అమలు కావడం లేదన్నారు.కాంగ్రెస్ హాయంలో కార్మికులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంలేదన్నారు.

కాంగ్రెస్,బిజెపిలకు కార్మిక,కర్షక లోకం సమస్యలు పట్టవని విమర్శించారు. కార్మికుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించి, వారి ఆరోగ్యాన్ని కాపాడేలా కృషి చేసి, నిరంతరం పర్యవేక్షించే ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు.తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల గొంతుగా ఉండి ప్రజా సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానన్నారు.
మోదీ గ్యారంటీలతో పేదలకు ఒరిగేది ఏమీ లేదు:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మోదీ గ్యారెంటీలు వేల కోట్ల ప్రజాధనాన్ని అదానీ,అంబానీలకు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప, కార్మికులు,కర్షకులకు ఒరిగేది ఏమీ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో పేదల బతుకులు ఛిద్రం అయ్యాయని అన్నారు.కార్మిక కర్షక లోకానికి మోడీ చేసింది ఏమీ లేదన్న ఆయన, బిజెపిని గెలిపిస్తే కార్మిక లోకం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు.
కేసీఆర్ హయంలో కార్మికుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఉందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కార్మికులకు న్యాయం చేసిన పార్టీ భారాసను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని,వరికి రూ.500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. పెన్షన్లు రూ.4,000 లకు పెంచుతామని, కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలన్నీ అటకెక్కాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ బైకని శ్రీనివాస్ యాదవ్,వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు, నాయకులు వాకిటి శ్రీధర్,లక్ష్మయ్య, విజయ్ కుమార్,నందిమల్ల అశోక్, గడ్డం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
