మీడియా ప్రకటన తేదీ:09.05.2024 అలంపూర్ ప్రజా సమస్యలపై గళం విప్పుతా…ఎంపీగా గెలిపించండి:

మీడియా ప్రకటన తేదీ:09.05.2024 అలంపూర్ ప్రజా సమస్యలపై గళం విప్పుతా…ఎంపీగా గెలిపించండి
డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్*తనను ఎంపీగా గెలిపిస్తే, పార్లమెంటులో గళం విప్పి, వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు అహర్నిశలు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గురువారం అలంపూర్ పట్టణంలో భారీ రోడ్ షో, ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే విజయుడుకు కుడి భుజంగా మారి,అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నడిగడ్డ ప్రజలు నన్ను ఉండు మనసుతో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని కంకణం కట్టుకున్న పార్టీ నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఒకప్పుడు తుంగభద్ర నదిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు , భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేసే వారిని అన్నారు. చల్లా వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి శంకరాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాలకు నదిపై వంతెనలు నిర్మించారని గుర్తు చేశారు.జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ఆశీస్సులతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తథ్యమని దీమా వ్యక్తం చేశారు. *చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ* కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి విమర్శించారు.

ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఎన్నికల్లో ఓట్ల కోసమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ కాంగ్రెస్ వైఫల్యాలపై మాట్లాడుతున్నందుకే రైతుబంధు ఇస్తున్నారని అన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో అలంపూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ మనోరమ వెంకటేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.