ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రశ్నించే గొంతుక కావాలి

ప్ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రశ్నించే గొంqqqతుక కావాలి
మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (కడ్తాల్)
తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని హామీలు ఆచరణలోకి రావాలంటే ప్రశ్నించే గొంతుక భారాస పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో స్థానిక వైస్ ఎంపీపీ ఆనంద్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమలుకునోచుకొని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని 10 సంవత్సరాల భారాస ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లిందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు,నీళ్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత హామీలు అమలు అవుతాయని మరొకసారి నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని, కావున ప్రజలు వారి మాయమాటలను ఓటుతో తిప్పి కొట్టాలని ప్రజలకు సూచించారు. మోసపూరితమైన హామీలు ఇచ్చి పబ్బం గడుపుతున్న కాంగ్రెస్,బిజెపి పార్టీల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ హామీలను అమలుపరిచే విధంగా ప్రశ్నించే గొంతుకైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లాయక్ అలీ, భారాసా ఉపాధ్యక్షుడు సిద్దిగారి వెంకటేష్, బోసు వెంకటేష్,నాగార్జున,శ్రీకాంత్, శ్రీను, శ్రీశైలం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
