ఙ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకుడు తొంద యాదయ్య ముస్లిం సోదరులకు, మండల ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, అది ఓ దీక్షాత్మక జీవన విధానం. నిరీహత, దయ, సహాయసహకారాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచే పవిత్ర సంస్కృతి,” అని యాదయ్య పేర్కొన్నారు. మతపరమైన విభేదాలను విడనాడి, సహనం, శాంతి, ప్రేమతో జీవించేందుకు రంజాన్ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత తొండ యాదయ్య తన సందేశంలో, “మతాలు వేరు అయినా మానవతా విలువలు అన్నీ ఒక్కటే. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవడం, అవసరమైన వారికి సాయం చేయడం మన బాధ్యత. ఈ రంజాన్ ద్వారా మానవత్వానికి మరింత బలాన్ని అందించాలి” అంటూ పిలుపునిచ్చారు. సామాజిక సేవలో విశేషంగా రాణిస్తున్న తొండ యాదయ్య , అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వ మానవాళి శాంతి, ఆనందం, అభివృద్ధి దిశగా సాగాలని ఆకాంక్షించారు.