శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకొని మోసపోకూడదు

శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకొని మోసపోకూడదు
ఎలాంటి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు వేసి డబ్బులు వృధా చేసుకోకూడదు
వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి
జ్ఞాన తెలంగాణ వలిగొండ జూన్ 7
వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి పర్మిషన్లు లేకుండా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల అనే పేరుతో అడ్మిషన్లకు తిరుగుతా ఉన్నారు ఈ చైతన్య పాఠశాలకు ఎలాంటి అడ్మిషన్లు తీసుకొని మోసపోవద్దని అన్నారు 20 రోజుల క్రితం వలిగొండ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల అనే బోర్డు పెట్టి అడ్మిషన్లు తీసుకున్న పరిస్థితి. దీన్ని వెంటనే జిల్లా విద్యాధికారి గారి దృష్టికి తీసుకుపోగా వారు స్పందించి ఈ పాఠశాలకు ఇలాంటి గుర్తింపు పర్మిషన్లు లేవు అడ్మిషన్లు వేసి తల్లిదండ్రులు మోసపోవద్దు అని చెప్పి జిల్లా విద్యాధికారి గారు సూచించారు ఆ తర్వాత మండల విద్యాధికారి శ్రీ చైతన్య పాఠశాలపై కేసు నమోదు చేశారు ఇలాంటి పాఠశాలల్లో మీ మీ పిల్లలను చేర్చి అడ్మిషన్ల పేర్ల ఫీజులు కట్టి మోసపోవద్దని ఇలాంటి స్కూల్లో పూర్తిగా నడుస్తాయో మధ్యలో ఆగిపోతే తెలియని పరిస్థితి ఇలాంటి పాఠశాలలో మీ పిల్లల అడ్మిషన్లు వేసి వాళ్ళ భవిష్యత్తులో ఖరాబు చేయొద్దని ఎస్ఎఫ్ఐ గా తెలియజేస్తూ అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకునేలా ఈచట్టం అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు మండల అధ్యక్షులు SK ఫర్దిన్, మైసోల్ల నరేందర్, వేములకొండ వంశీ తదితరులు పాల్గొన్నారు