మన్మర్రి హై స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు ది హ్యాకేట్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సెస్,నోట్ బుక్స్ డొనేషన్

- ది హ్యాకేట్ గ్రూప్ కొండాపూర్ ఎంప్లాయ్ మన్మర్రి గ్రామవాసి పుల్లన్నగారి రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో 50 వేల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సెస్,నోట్ బుక్స్ అందజేత.
- హాజరైన ది హాకెట్ గ్రూప్ ఎంప్లాయిస్
జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 04:
షాబాద్ మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలోని హై స్కూల్ విద్యార్థినీ,విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా చూడాలన్నదే తన సంకల్పంగా కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి పాఠశాల విద్యార్థిని విద్యార్థుల అభ్యున్నతికి ప్రతిక్షణం పాటుపడుతూ అటు ఉపాధ్యాయులకు విద్య పట్ల ఒత్తిడి చేస్తూ ఇటు విద్యార్థిని, విద్యార్థులకు సలహా,సూచనలు ఇస్తూ,హై స్కూల్ సమస్యలకు తన వంతు సహాయంగా గతంలో స్కూల్ పెయింటింగ్,బెంచీలు, సమకూర్చడంలో తన తోటి ఉద్యోగుల సహకారంతో పని పూర్తి చేయడం జరిగింది.అదేవిధంగా మౌలిక వసతులు లేనటువంటి హై స్కూల్,ప్రైమరీ స్కూల్ లలో తన సొంత ఖర్చులతో మౌలిక వసతులు కల్పించి,విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆశిస్తూ 50వేల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సెస్,నోట్ బుక్స్,పెన్సిల్స్ హ్యాకేట్ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపనీ సహకారంతో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బసప్ప మాట్లాడుతూ మన్మర్రి ప్రభుత్వ పాఠశాలలో చదివానన్న చిన్న జ్ఞాపకంతో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల యోగక్షేమాలు ప్రతిక్షణం కనుక్కుంటూ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి తీర్చేటటువంటి గొప్ప వ్యక్తి రాజేందర్ రెడ్డి అని అన్నారు. ఈయన గతంలో స్కూల్ పెయింటింగ్,బెంచీలు మౌలిక వసతులు,తదితర పనులను తన ఫ్రెండ్స్ సహకారంతో పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తాను ఉద్యోగం చేసే కంపెనీ సహకారంతోఊ 50,000వేల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సెస్ నోట్‌బుక్స్ అందించడం గొప్ప విషయం అని అన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తామని మంచి మనసుతో వాటిని తీర్చాలని అన్నారు.ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచి పని చేయడానికి నేనెప్పుడూ వెనకాడబోనని మంచి పని చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్, మా కంపెనీ స్టాప్ సహకారం నాకు వంద శాతం ఉంటుందని అన్నారు. నేనొక మంచి పని గురించి వారితో ఆలోచన చేసినప్పుడు వెంటనే స్పందించి నా ఆలోచనకు బలం చేకూరుస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే నా ఫ్రెండ్స్,కంపెనీ స్టాఫ్ సహకారంతో ఆ సమస్యలను వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకెట్ గ్రూప్ కంపెనీ స్టాప్ సాయి ప్రదీప్,సంతోష్, లక్ష్మీ,యశస్విని, సౌమ్య, స్కూల్ స్టాప్ హెచ్ఎం బసప్ప, చంద్రయ్య, అంబర్ సింగ్, పరమేష్, ఆంజనేయులు, లలిత కుమారి, అనురాధ రెడ్డి,వెంకటమ్మ, విద్యార్థిని,విద్యార్థులు వెంకటయ్య, ఆండాలమ్మ,తదితరులు పాల్గొన్నారు.
