రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి: కలెక్టర్

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడంవల్ల మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు.అనంతరం రక్తదానం చేసిన పలువురిని సన్మానించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఏకశిర పార్కు వాకర్ అసోసియేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు శుక్రవారం నాడు ఏర్పాటు చేశారు.53 యూనిట్ల రక్తాన్ని ఇచ్చిన సందర్భాన్ని పునస్కరించుకొని వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో పలువురిని సన్మానించారు.

You may also like...

Translate »