జర్నలిస్టుల నోట్లో మట్టికోడతారా??

జర్నలిస్టుల నోట్లో మట్టికోడతారా??
- ఇచ్చిన పట్టాలను లాగేసుకోవడం దుర్మార్గం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల నోటికాడి ముద్దను లాగేసు కుంటారా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జర్నలి స్థులకు మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేయడం పై ఆయన మండిపడ్డారు. జర్నలిస్టులు పడుతున్న కష్టాలపై లేఖలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయమన్నారు.
