పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దు…

బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగితే చర్యలు తప్పవు..

ఇలాంటివి చూసి పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉన్నది

ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలి.

         ఎస్సై జి శ్రావణ్ కుమార్

జ్ఞానతెలంగాణ చిట్యాల, మే25:

బహిరంగంగా మద్యం తాగడం, ధూమపానం (సిగరెట్) చేయడం లాంటివి చట్టరీత్య నేరం అని చిట్యాల మండల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై మండల వ్యాప్తంగా నిఘా ఉంచాం అని, అక్రమ సిట్టింగ్ లు, బహిరంగంగా మద్యం తాగడం, సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఇలాంటివి చూసి వాటికి పిల్లలు అలవాటు పడి తప్పుడు మార్గం లోకి వెళ్ళే అవకాశం ఉన్నది అని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకోవాలని అన్నారు.
మైనర్ పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు అని హెచ్చరించారు. వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది అని గుర్తు చేశారు..

You may also like...

Translate »