ఐకెపి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

ఐకెపి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండలం నాగన్ పల్లి గ్రామంలో శుక్రవారం మహిళ సమాఖ్య -1 ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు.ఈ సంధర్బంగ డీపీఎం రాచయ్య మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా స్కూల్ యూనిఫామ్స్ కుట్టించి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ ఆద్వర్యంలో 2122 యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వడం జరిగిందన్నారు. అందులో బాగంగా నాగన్ పల్లి గ్రామంలో 2 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ లకు స్కూల్ యూనిఫామ్స్ అందించినట్లు తెలిపారు. త్వరలో డ్రెస్సులు కుట్టిన మహిళ సంఘాలకు డ్రెస్సుకు 75/-ల చొప్పున డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం. వినోద్ కుమార్ , హెడ్ మాస్టర్ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

You may also like...

Translate »