లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. మే 28 :లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం సేవలు అభినందనీయమని,నిరుపేద కుటుంబాలకు లైన్స్ క్లబ్ అండగా ఉంటుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకులైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా,గొడుగుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే లయన్స్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ భద్రాచలంసభ్యులు పాల్గొన్నారు.