పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
- గన్నేపాగ నర్సింగ్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా జామెట్రి బాక్స్, పెన్నులు అందజేత
- చదువుతోనే భవిష్యత్తు బంగారు బాట – గన్నేపాగ నర్సింగ్ రావు
జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ :మండలం లోని చిన్నామంగళారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు, ప్రధానోపాధ్యాయులు ఎస్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గన్నేపాగ నర్సింగ్ రావు మాట్లాడుతూ, “చదువుతోనే అన్ని రంగాల్లో విజయాలు సాధించవచ్చు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును బంగారు బాటలో నడిపించుకోవాలి” అని సూచించారు. అలాగే, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువ నాయకులు పాల్గొన్నారు.
