బడిబాటలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ


జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం పాఠశాల పునః ప్రారంభ సందర్భంగా సాలూర మండల తహశీల్దార్ రమేష్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుషా ,ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు అల్లే జనార్ధన్ , అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు రేఖ , గ్రామ పెద్దలు గంగారం , విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...

Translate »