వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు,శ్రీరంగపురం, గోపాల్ పేట్, రేవల్లి, పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల్లో పల్లు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి,షాది ముబారాక్,సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ లబ్ధిదారులకు ఈ నెల 7న మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు లబ్ధిదారులకు చెక్కులను అందజేయునున్నారు.కావున ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పరిధిలోని లబ్దిదారులు హాజరై చెక్కులను పొందాలని ఎమ్మెల్యే క్యాంప్ నుండి పిలుపునివ్వడం జరిగింది.