వ్యక్తి అదృశ్యం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాల ప్రకారం మండలంలోని పాలమాకుల గ్రామానికి చెందిన చింతకింది మహేష్ (21) డ్రైవింగ్ చేసేవాడు
మంగళ వారం నాడు తన పక్కన ఇంటి వారైన రవి వద్ద బైక్ తీసుకుని వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు బైక్ ఇచ్చినటువంటి రవి మహేష్ కి ఫోన్ చేయగా ఇంటికొచ్చే మార్గంలో ఉన్నానని సమాధానం ఇచ్చాడు.కూటింబికులు ఎన్ని సార్లు ఫోన్ చేసిన కాల్స్ లిఫ్ట్ చేయలేదని తిరిగి ఇంటికి రాకపోవడంతో రవి మరియు మహేష్ కుటుంబికులు ఫోన్ చేయగా మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతనికోసం చుట్టూ ప్రక్క ప్రాంతాలలో వెతికిన బంధువులను స్నేతులను సంప్రదించిన ఎటువంటి ఆచూకీ లభించక పోవడంతో గురువారం నాడు పోలీస్ స్టేషన్ ను ఆశ్రాయించారని తెలియజేసారు. తప్పిపోయిన వ్యక్తి ఎత్తు: 5.8 అడుగులు, రంగు: చామంచయ మరియు బ్లాక్ కలర్ టీ-షర్ట్ & బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలియ జేశారు.కూటింబికులు ఇట్టి విషయం పై చర్య తీస్కోవాలని పిర్యాదు చేశారు. ఇట్టి విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేసారు..

You may also like...

Translate »