శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం

శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం


పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం


జ్ఞాన తెలంగాణ, తిరుమలాయపాలెం:


తిరుమలాయపాలెం మండల పరిధిలో గోల్ తండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ది అందని ద్రాక్షగానే మిగిలింది.

అంగన్వాడి కేంద్రంల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు,పౌష్టికాహారం అందించడం కోసం 20 సంవత్సరాల క్రితం నిర్మించిన, అంగన్వాడీ కేంద్రంలో, ప్రస్తుతం 30 మంది పిల్లలు, గర్భిణీ బాలింతలు ఏడుగురు ఉన్నారు. విద్య బుద్దులు, పౌష్టికాహారం, అందిస్తుండగా భవనం శిధిలావస్థకు చేరి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పై కప్పు ఎప్పుడు కూలి పడుతుందోనని, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ భవనం పెచ్చులు ఊడిపడి పలుమార్లు విద్యార్థులు గాయపడిన సంఘటనలు ఉన్నాయని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు.

భారీ ప్రమాదం చోటు చేసుకోకముందే శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని కూల్చి వేసి నూతన భవనాన్ని నిర్మించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.

You may also like...

Translate »