బిఆర్ఎస్ పార్టీ NH 161 పై ధర్నా కార్యక్రమం

  • గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహణ
    జ్ఞాన తెలంగాణ,న్యూస్. నారాయణఖేడ్:
    తేదీ 22-05-2024 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు. కల్హేర్ మండలం మసాన్ పల్లి X రోడ్డు నేషనల్ హైవే 161 పైన రాష్ట్ర ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడం పైన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.

కావున కల్హేర్ మండలానికి సంబంధించిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గౌరవ జడ్పిటిసి, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,pacs చైర్మన్లు, వార్డ్ సభ్యులు, యువత అధ్యక్షులు, సోషల్ మీడియా అధ్యక్షులు, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము.

You may also like...

Translate »