ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి టౌన్ //కొండాపూర్ //మే 29. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలియజేశారు.
ప్రజావాణి దరఖాస్తులు కూడా వెంటనే పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
తహసిల్దార్ వద్ద ఉన్న ధరణి దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూసుకోవాలని సూచించారు.
అవసరమైతే ఆయా శాఖల అధికారులను సంప్రదించాలని కలెక్టర్ తెలియజేశారు.