బీర్కూర్ జోడి లింగాల ఆలయాలకు వెండి కెరటాలు విరాళం అందజేసిన భక్తుడు

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 27:

బాన్సువాడ : బాన్సువాడ మండలం బిర్కూర్ మంజీర పర్యక ప్రాంతానికి వెళ్లే పోలీస్ స్టేషన్ సమీపంలో గల శతాబ్దాల కాలం నాటి జోడి లింగాల ఆలయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ దానిని కొందరు కబ్జా చేసుకుని అనుభవిస్తున్నారు తప్ప దిద్దుల వద్దకు చేరుకున్న ఈ ఆలయాన్ని బాగు చేద్దాం అన్న ఆలోచన కనిపించడం లేదు మరొకవైపు దేవాదాయ శాఖ ఈ ఆలయం పై దృష్టి పెట్టడం లేదు. దీని వల్ల భక్తులే ముందుకొచ్చి ఎవరికి తోచినంత వారు తమ సహాయ సహకారాలు అందించి జోడి లింగాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకొని వెండి బంగారం వ్యాపారస్తుడు ఎం సూర్య ప్రకాష్ ఆయన సతీమణి కోటేశ్వరమ్మ జోడి లింగాల ఆలయాలకు వెండి కెరటాలను విరాళంగా బుధవారం అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పరమశివుని ఆశీస్సులు తమకు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కుటుంబంతో పాటు వారు ధన్యులు శ్రీకాంత్ శశికా నీ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

You may also like...

Translate »