చెరువులో చేపల మృత్యువాత

చెరువులో చేపల మృత్యువాత
జ్ఞాన తెలంగాణ – బోధన్
సాలూర మండల కేంద్రంలోని కామక్క చెరువులో సరిపడా నీరులేక అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు వేడెక్కడంతో చేపలకు సరిగా ఆక్సిజన్ లభించక చేపలు మృతూయువాతపడుతున్నాయి. దాంతో మత్స్యకారులు వారి ఆదాయాన్ని కోల్పోతున్నారు. చెరువులో చేపలు మృత్యువాతపడుతుండడంతో చెరువు పరిసర ప్రాంతం దుర్గంధభరితంగా మారింది. చేపల వేటకు కొంగలు భారీ సంఖ్యలో వాలిపోవడంతో చెరువు తెల్లని వర్గంలో కనబడుతుంది.