దారుణం.. చిన్నారుడి పై విధి కుక్కల దాడి..

  • ఈ దాడిలో ఎడమ కన్నును కోల్పోయిన బాలుడు..
  • నాగులపల్లి గ్రామంలో వెలుగుచూసిన ఘటన..
  • విధి కుక్కల పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల వేడుకలు..
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు..

ఇంటి గేట్లో కుక్కలుండటం షరా మామూలే.గల్లీలో గ్రామ సింహాలు గ్రూపులుగా సంచారించడం ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారిపోయింది. గ్రామాల్లో కుక్కల బెడదా నుండి కాపాడండి మహాప్రభు అంటూ సంబంధిత శాఖ అధికారులకు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల శూనకల దాడులు జగిగిన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం తీరా నష్టం జరిగాక గానీ స్పందించకపోవడం ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించడం సంబంధిత శాఖ డోళ్ళతనానికి నిదర్శనమే ఈ గుంపు మేస్త్రీల సంచారం అంటూ గ్రామస్థులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు…. పూర్తి వివరాల్లోకి వెళితే ఫరూఖ్ నగర్ మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో జనార్దన్ జ్యోతి దంపతుల కుమారుడు రీత్విక్ (3) ఇంట్లో ఆడుకుంటూ ఇంటి నుండి బయటకు రావడంతో ఒక్కసారిగా కుక్కలు బాలుడు పై దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో బాలుడు రూత్విక్ ఎడమ కన్నుకు తీవ్రంగా గాయమైంది. హుటాహుటిన షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్ సరోజినీ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడి కన్నుకు ఆపరేషన్ చేశారు.ఈదాడిలో బాలుడికి ఎడమ కన్ను పూర్తిగా కోల్పోయాడు.అని డాక్టర్ ను తెలియజేయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేరేక చోటు నుండి కుక్కలను పట్టుకొచ్చి మా గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలను వదిలిపెట్టారని చిన్నారులు ఒంటరిగా ఉంటే కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.వీధి కుక్కలని కట్టడి చేయాలంటే ప్రజలకు తలకు మించిన భారంగా మారింది ఇలాంటి ఘటనలు మరెన్ని పునరావృత్తం అవ్వుతాయోనని గ్రామస్థులు భయందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుక్కలని పట్టుకోవాలని నాగులపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

You may also like...

Translate »