సీపీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు

సీపీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జఫ ర్ గఢ్ మండలంతో పాటు గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మరియు కార్మిక సంఘం ఏఐటీయూసీ హమాలి మరియు భవన నిర్మాణ కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి జువారి.రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో 8గంటల పనిదినాల కోసం సాగినా ఉద్యమం అనేకమంది కార్మికుల రక్త తర్పణ పుట్టి ప్రపంచాన్నే మరియు కార్మికులను ఏకం చేసిందీ ఎర్రజెండా అని ఆయన అన్నారు. ఆ ఉద్యమంలో కార్మికులు వారి హక్కులను సాధించుకున్న రోజే ఈ రోజు మేడే అని కొనియాడారు. మరి ఇప్పుడున్న పాలకులు కార్మికుల హక్కులను కాలరాసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవస్థలను కార్పొరేట్ దొంగలను అప్పజెప్పి కార్మికుల సమ్మె చేసే హక్కును బిజెపి నరేంద్రమోదీ ప్రభుత్వం హరిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కార్మికులు ఏకమై బీజేపీ ని గద్దె దింపి మన హక్కుల కోసం మాట్లాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల సమ్మయ్య MD యాకుబ్ పాషా మంద బుచ్చయ్య మండల గట్టుమల్లు కురపాటి. చంద్రమౌళి అన్నెపు అజయ్ ముసలైయ్య MD జాఫర్ ప్రభాకర్ వెంకటయ్య శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.