కోవిడ్ పేషెంట్స్ ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు అలాంటి పనులకు దూరంగా ఉండాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Image Source | BBC
కోవిడ్ పేషెంట్స్ ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు అలాంటి పనులకు దూరంగా ఉండాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ప్రస్తుతం దాదాపు కనుమరుగైంది. మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ఇప్పుడు శాంతించింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలగిస్తోంది.
ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు హఠాత్తుగా మరణిస్తున్న సంఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. ఈ క్రమంలోనేతాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా బారిన పడిన రోగులు వీలైనంత వరకు అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామాలు కూడా చేయొద్దని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయాన్ని ఉటంకిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశార.
తీవ్రమైన కోవిడ్19 ఇన్ఫెక్షన్‌తో బాధపడిన వారు.. కనీసం రెండేళ్ల వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అధిక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని సూచించారు.