కోర్టు విధులపై, చట్టాలపై ఒకరోజు శిక్షణ.

Oplus_131072

జ్ఞాన తెలంగాణ – బోధన్కోర్టు విధులపై బోధన్ డివిజన్ పోలీస్ అధికారులకు అదనపు పీపీలు బోధన్ కోర్టు ప్రాంగణంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి , డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నరసయ్య ఆదేశాల మేరకు బోధన్ కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు అదనపు పీపీ శ్యాంరావు తెలిపారు.ఈ శిక్షణలో భారతీయ న్యాయ సంహిత చట్టం 2023 గురించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన వివరించారు. అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 గురించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య వివరించారు. భారతీయ సాక్ష్య అదినియం న్యాయం 2023 గురించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిదిరాల రాణి వివరించారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ లు వీరయ్య, కోల నరేష్, రుద్రూర్ సర్కిల్ సీఐ జయేష్ రెడ్డి, వర్ని ఎస్ఐ క్రిష్ణ కుమార్, ఎక్సైజ్ ఎస్సై ఎండి జలీలుద్దీన్, రుద్రూర్ ఎస్సై అప్పారావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వందన , బోధన్ కోర్టు పోలీస్ కానిస్టేబుల్ , ఎక్సైజ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »