అవినీతి RCO నాగార్జున రావు ని వెంటనే డిస్మిస్ చేయాలి.@ TTWREIS – Mahbubnagar Region

సింభన్ (ముకురాల్ శ్రీహరి రెక్స్), జై భీమ్ యూత్ ఇండియా – JBYI,తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ – TGPA

Reasons:-
➖ ప్రిన్సిపాల్స్ తో కుమ్మక్కై తన పరిధిలోని గురుకులాలను గాలికి వదిలేసిన నాగార్జున రావు ఈ పదవిలో ఉండటానికి అనర్హుడు.

➖ “ఆకలైతే అన్నం కాదు, అక్షరాలు తినాలి” గత కార్యదర్శి & ప్రస్తుత BSP రాష్ట్ర అధ్యక్షులు RSP గారు ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు. కానీ ఈ రీజియన్ లో ఆర్సిఓ నిర్లక్ష్యం వలన గురుకుల విద్యార్థులకు అన్నంతో పాటు చదువు కూడా కరువైంది.
( వాస్తవానికి RSP గారు ఏరోజు గురుకుల విద్యార్థులను ఆకలికి బలి చేయలేదు. ప్రపంచస్థాయి మెనూని ఈ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ అధికారులు ఆ మెనూని తుంగలో తొక్కారు)

➖ తన అధికార దురహంకారంతో న్యాయంగా సీనియర్స్కి దక్కవలసిన పదవులను జూనియర్స్ & అనర్హులకు కి కట్టబెడుతున్న ఈ RCO ఒక నీచుడు.

➖ TTWURJC(Boys) Mannanur లో రాధాబాయి అనే సీనియర్ మరియు ఆల్రెడీ ప్రిన్సిపాల్ గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాదని, లంచాలకు కక్కుర్తి పడి పద్మావతి అనే జూనియర్ కి అనుభవం లేని వ్యక్తికి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు ఇచ్చాడు ఈ ఆర్సిఓ నాగర్జున రావు.
(ఈ స్కూల్లో ఈమె ప్రిన్సిపాల్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన అక్రమాలు నిర్వాకాలు చాలా ఉన్నాయి వాటి గురించి అతి త్వరలో మాట్లాడుతాం – సాక్షాధారాలతో సహా)

➖ పద్మావతి తో కుమ్మక్కైన ఈ ఆర్ సి ఓ నాగార్జున రావు అంతకుముందే సీనియర్ మరియు ప్రిన్సిపాల్ గా అనుభవం ఉన్నటువంటి రాధా అబ్బాయిని డిప్యూటీషన్లో వేరే స్కూల్ కి పంపించి, జూనియర్ మరియు అనుభవం లేని వ్యక్తి అయినటువంటి పద్మావతికి ప్రిన్సిపాల్ గా పోస్ట్ ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ అదే స్కూల్ కి రాధాబాయి గారిని తీసుకురావడం జరిగింది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు కంటే వ్యక్తిగత స్వార్థాలే ఈ ఆర్సిఓకు ముఖ్యం అనేది మనకు అర్థమవుతుంది.

➖ ఈ పరిధిలోని గురుకులాల్లో లక్షల రూపాయల విలువ చేసే పాత సామాన్లు అమ్మి, వందల రూపాయల్లో లెక్కలు చూపించడం ఈ ప్రిన్సిపాల్స్ & RCO యొక్క నైజం.

➖ రామచందర్ అనే ఒక కాంట్రాక్ట్ “జూనియర్ అసిస్టెంట్” నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాలుగా RCO ఆఫీస్ లో డిప్యూటేషన్ ద్వారా తిష్ట వేశాడు. ఇతను ఈ రీజియన్ లో ఆర్సిఓకు ప్రతిరూపంగా చెప్పుకుంటూ టీచింగ్, నాన్ టీచింగ్ & కాంట్రాక్టర్స్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆర్సిఓ అండతో అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఇతని అక్రమలపై, అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేసి వెంటనే సస్పెండ్ చేసి ఈ గిరిజన గురుకులాలను కాపాడాలి. మరియు ఇతని బాధితులకు న్యాయం చేయాలి.

➖ ఈ పరిధిలోని చాలా గురుకులాలలో ఇప్పటికీ టిఫిన్స్ లోకి వట్టి మిరపకారం పెడుతుంటారు. మిరప కారం తింటే ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తుంటాడు ఈ దుర్మార్గపు RCO. (మేము గతంలో ఈ RCO ఆఫీసు ఉన్నటువంటి “బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో” గమనించడం జరిగింది, ఇది వాస్తవం. అప్పుడు ఉన్న RCO నిర్లక్ష్యానికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ రీజియన్ నుంచి ఆమెను సాగనంపడం జరిగింది.)

➖ మెనూ అమలు చేయకుండా ప్రిన్సిపాల్స్ తో కుమ్మక్కై నెలవారీ కమిషన్స్ తీసుకోవడం ఈ RCO గారి నైజం.

➖ RCO & ప్రిన్సిపాల్స్ క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం వలన ఈ పరిధిలోని అన్ని గురుకులాల్లో విద్యార్థులు మొబైల్స్ వాడుతూ, బీర్లు తాగుతూ, సిగరెట్లు తాగుతూ తమ విలువైన భవిష్యత్తును మరియు చదువును నిర్లక్ష్యం చేసుకోవడానికి ఈ RCO నే కారణం.

➖ 01/06/2023 వాడు గురుకులాల కార్యదర్శి గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ప్రకారంగా ఎవరైతే గత సంవత్సరం పని పనిచేసినటువంటి “పార్ట్ టైం సిబ్బంది” ఉన్నారో వారిని కొనసాగించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ పరిధిలోని ఆర్సిఓ నాగార్జున రావు లంచాలు తినమరిగి పార్ట్ టైం సిబ్బందిని వెంటనే డ్యూటీలోకి తీసుకోకుండా, డెమోలు పెట్టి తర్వాత తీసుకుంటాం అని భయపెట్టి, తన అనుచరుడు రామచందర్ ద్వారా లంచాలు వసూలు చేసిన తర్వాత కార్యదర్శి గారి ఆదేశాలు అమలు చేయడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరపాలి.
ఆర్సిఓ నాగార్జున రావు, జూనియర్ అసిస్టెంట్ రామచందర్ మరియు క్షేత్రస్థాయిలో వీరికి అనుచరులుగా పని చేస్తున్నటువంటి కొందరి “కాల్ డాటా & వాట్సాప్ డాటా” పై విచారణ చేస్తే వీళ్ళ అవినీతి అక్రమాలు పూర్తిగా బయటపడతాయి.

➖ జూనియర్ అసిస్టెంట్ రామచందర్, ప్రిన్సిపాల్స్ మరియు RCO గార్ల టార్చర్ భరించలేక… ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నటువంటి “పార్ట్ టైం, కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్” సిబ్బంది జీవితాలు రోడ్డున పడ్డాయి.

➖ ప్రిన్సిపాల్స్ ఏ కులానికి చెందుతే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ విచ్చలవిడిగా పోస్టులు ఇచ్చుకుంటున్నారు. ప్రశ్నించిన వ్యక్తులను బలి చేస్తున్నారు.

➖ కొందరు ప్రిన్సిపాల్స్ “పార్ట్ టైం టీచింగ్” సిబ్బంది దగ్గర నెలవారి కమిషన్స్ మాట్లాడుకుని, గురుకులం ఏ పరిధిలో ఉందో, ఆ పరిధికి అతి సమీపంలోని(1-5km) వ్యక్తులనే టీచర్స్ గా నియమించుకున్నారు. వీరికి ఆర్.సి.ఓ గారి సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్సిఓ కి కూడా ఆ కమిషన్స్ లో వాటా అందుతుంది. ఇలాంటి ధోరణి వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోక తప్పదు.

Demands:-

1). RCO నాగార్జున రావును తక్షణమే డిస్మిస్ చేయాలి.

2). జూనియర్ అసిస్టెంట్ రామచందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

3). వీరి అవినీతిపై విజిలెన్స్ & ACB తో పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.

4). క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, నిస్వార్ధంగా పనిచేస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసే వ్యక్తిని RCO గా నియమించాలి.

5). అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రిన్సిపాల్స్ ని, నిబంధనలకు విరుద్ధంగా నియమించబడ్డ ప్రిన్సిపాల్స్ ని మరియు సిబ్బందిని అన్యాయంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ ని వెంటనే తొలగించాలి. అర్హులకు, నీతి నిజాయితీ గల వ్యక్తులకు మరియు అనుభవజ్ఞులకే ప్రిన్సిపాల్స్ గా నియమించాలి.

6). అమ్మాయిల క్యాంపస్లో పూర్తిస్థాయి పగడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి.

7). ప్రతి ఒక్క గురుకుల క్యాంపస్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

8). “ఫుడ్ పాయిజన్స్” జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి.

9). అనారోగ్యానికి గురైన విద్యార్థులను కాపాడటానికి కార్పొరేట్ వైద్యం అందించాలి. గతంలో ఆర్ఎస్పి గారు ఏర్పాటు చేసినటువంటి PANACEA – పనాసియా హెల్త్ కమాండ్ సెంటర్ ను బలోపేతం చేయాలి.

10). గురుకులాల సొంతభవనాల ఏర్పాటు కోసం కృషి చేయాలి.

11). మైనారిటీ గురుకులాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ సిబ్బందికి ఇస్తున్నటువంటి జీతాల కంటే.. మిగతా గురుకులాలలో సిబ్బందికి జీతాలు తక్కువగా ఇస్తున్నారు. ఇది చాలా వివక్షత పూరితమైన చర్య. “జై భీమ్ యూత్ ఇండియా” ఈ వివక్షతను తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఇతర గురుకులాల్లో పని చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా జీతాలు పెంచాలి.

12). గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం మరియు ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి.

13). 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి జాబ్ సెక్యూరిటీ కల్పించాలి.

14). గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ పూర్తిస్థాయి “ఆరోగ్య భీమా” కల్పించి తక్షణమే “హెల్త్ కార్డులు” మంజూరు చేయాలి.


మా క్షేత్రస్థాయి పర్యటనలో ఈ సమస్యలు గుర్తించడం జరిగింది. కాబట్టి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో గురుకులాల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు

You may also like...

Translate »