బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

- వాటర్ డ్రెయిన్,యు.జి.డి, రోడ్లపై త్వరిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
- ప్రతి కాలనీ సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా బస్తీ దర్శన్
- కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) :
భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.
ఎల్.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్ వాల్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ పలు సూచనలు చేస్తూ,అక్కడి వాటర్ డ్రెయిన్ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.తరువాత బాంబే కాలనీకి వెళ్లిన ఆమె, అక్కడి రోడ్డు సమస్యలను పరిశీలించి, ముందుగా యు జి డి లైన్ వేయించి తర్వాతే రోడ్ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.దీనికి సంబంధించి హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి అధికారులకు నూతన యుజిడి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.ఇక ఎల్.ఐ.జి కాలనీలో అవసరమైన చోట్ల కొత్త సీసీ రోడ్ల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈ దేవేందర్,ఏ.ఈ ఫైజన్, ఎల్.ఐ.జి కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి,డైరెక్టర్లు లక్ష్మణ్, సామ్యూల్ జాన్,యువజన
బిఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహ, మైనారిటీ కార్యదర్శి ఘౌస్, డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు అజీముద్దీన్, కుతుబుద్దీన్, జకీర్, నరేష్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
