కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

– గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు


జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,నవంబర్ 12:చేవెళ్ల నియోజకవర్గంలోని కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇటీవల HMDA నిధుల ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేయబడగా, బుధవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా లభించనుంది. గ్రామ ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కమ్మెట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడానికి కృషి చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »