ఆలయ కమిటీలో అగ్రవర్ణాల కుట్ర
ఆలయ కమిటీలో అగ్రవర్ణాల కుట్ర
ఆలయ కమిటీ నీ సంప్రదింపులు జరుపుకుండా నలుగురు పెత్తనం
దళితుడు గుడి చైర్మన్ కావద్దా…
గ్రామ ప్రజల మద్దతుతో చైర్మన్ అయినా కూడా కడుపు మంట ఎందుకు
జ్ఞాన తెలంగాణ, రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 21:

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ కమిటీలో కొందరు చిచ్చులు రేపుతున్నారు. వివరాల్లోకెళ్తే గత కొన్ని నెలల క్రితం వేణుగోపాల స్వామి జాతర మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ ఒక కమిటీని నిర్ణయించారు. ఆ కమిటీలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల నుండి సభ్యులను చేరుస్తూ 30 మందితో కూడిన ఒక కమిటీని గ్రామ సభలో గ్రామ ప్రజలందరి మధ్యలో నిర్ణయించారు. వారి కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండాలని నిర్ణయించారు.
ఈ కమిటీలో గడ్డం జితేందర్ (ఎస్సీ-మాల), గంట వెంకటేష్ గౌడ్ (బిసి-గౌడ) చదువుకున్న విద్యావంతులు కావడంతో గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా వారిని ఎన్నుకొని మిగతా కమిటీలలో ఆయా ప్రతి కుల సంఘాల నుండి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున కమిటీలో సమానత్వం ఉండేలా కమిటీని నిర్ణయించారు.
వేణుగోపాల స్వామి జాతర మహోత్సవం పూర్తయిన వెంటనే అగ్రవర్ణాల్లోని కొందరు కుటీలమైనటువంటి బుద్ధిని చూపిస్తూ తమకు సానుకూలమైనటువంటి వ్యక్తులను తోడు చేసుకుని తానే చైర్మన్, వైస్ చైర్మన్ అని ప్రజాప్రతినిధుల వద్దకు తిరుగుకుంటూ నిధుల సమీకరణ అంటూ, గా కులం వాళ్లు చైర్మన్ వైస్ చైర్మన్ గా ఉండడం ఏంటి అని గ్రామంలోని కొందరిని తమకు మద్దతు ఉన్నారంటూ ఆలయ కమిటీ లోని వారిలో చిచ్చులు పెట్టడం ప్రారంభించారు.
అది కాస్త తేదీ 21 ఏప్రిల్ 2024 రోజున ఆలయ కమిటీ లోని వారికి మరియు కొన్ని కుల సంఘాలకు ఆహ్వానం ఇవ్వకుండా ఆలయ కమిటీ నుండి మీటింగ్ ఉందని చెప్పి అక్కడ కమిటీని మార్చాల్సిందిగా కుట్రలు పన్నుతున్నారని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.
ఈ విషయంపై ఆలయ కమిటీని వివరణ కోరగా ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ మాట్లాడుతూ అనధికార వ్యక్తులు కొందరు ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఆలయ కమిటీ మీద ప్రకటనలు ఇస్తున్నారని, అలాంటి వ్యక్తుల పైన ఫిర్యాదు చేస్తామని త్వరలో అధికారికంగా ఆలయ కమిటీ తరపున గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి తరుణంలో ఇలాంటి కుల వివక్ష లాంటి ధోరణులు ఎదురవుతున్నప్పుడు ఆవేశపడకుండా వాటిని ఎదుర్కోవాలని ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ అన్నారు. వారి వెంట శ్రీ వేణుగోపాల స్వామి ప్రధాన కార్యదర్శి గంట అంజా గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
