అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్

జ్ఞాన తెలంగాణ
గండిపేట్

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగ్ మున్సిపాలిటీలో ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టగ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం లో నెగ్గింది.శుక్రవారం నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ గా నాగపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా విజయ్ బాబులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పలువురు ముఖ్య నేతల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ లుగా కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తానని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. చైర్మన్ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గడ్డం శేఖర్ యాదవ్ మరియు కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

You may also like...

Translate »