గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్టు

గద్దర్ కుమార్తె వెన్నల గారు

ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా డిసైడ్ అయినట్లేనట

చాలా కాలంగా గద్దర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వుడు స్థానం నుంచి బరిలో నిలబెట్టాలనుకుంటున్నది అయితే అక్టోబరు ఫస్ట్ వీక్‌లో ఏఐసీసీ వెలువరించనున్న తొలి జాబితాలోనే ఆమె పేరును పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఏఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మధు యాష్కీ స్వయంగా రెండు రోజుల క్రితం గద్దర్ నివాసానికి వెళ్లి వెన్నెలకు తెలియజేసినట్లు తెలిసింది అంతే కాకుండా గద్దర్ భార్య విమల కుమారుడు సూర్యంతోనూ ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం.

గద్దర్ ఫ్యామిలీలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేదానిపై రాష్ట్రస్థాయి నేతలు ఇటీవల రహస్యంగా చర్చించుకున్నారు కుమారుడు సూర్యానికి టికెట్ ఇవ్వడంకంటే కుమార్తె వెన్నెలకు ఇవ్వడమే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు.

ఇదే విషయాన్ని ఏఐసీసీకి కూడా తెలియజేయడంతో చివరకు ఆమె పేరునే ఖరారు చేద్దామంటూ స్టేట్ లీడర్లకు సంకేతాలు అందాయి. గద్దర్ తరహాలోనే ఉపన్యాసాలు ఇవ్వడం పాటలు పాడడం వెన్నెలలో కనిపించినట్లు స్టేట్ లీడర్లు అభిప్రాయపడ్డారు.

దీనికి అనుగుణంగానే ఆమెను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

You may also like...

Translate »