కల్లూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు..

కల్లూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు..
జ్ఞాన తెలంగాణ న్యూస్ కల్లూరు….
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో నడుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు సాధించాలని లక్ష్యంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఖమ్మం జిల్లా అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కల్లూరు పట్టణం మెయిన్ సెంటర్ లో వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ జన సంద్రోహం తో మీటింగ్ లో పాల్గొని సత్తుపల్లి నియోజకవర్గం నుండి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలి అని ప్రచారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 140 రోజులు వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అరు గ్యారెంటీలో లో భాగంగా ఐదు గ్యారెంటీలను అమలు చేసింది ఆగస్టు 15 తారీకు లోపు తెలంగాణ రాష్ట్ర రైతుల కు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్రంలో ఇంద్రమ్మ రాజ్యం రావాలంటే పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు , పొంగులేటి ప్రసాద్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ., రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ నాయకులు పసుమర్తి చందర్రావు , మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ సిపిఎం నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.