ధరలను పెంచి ప్రజలను మోసం చేసింది బిజెపి -కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి .

సాలూరలో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి .జ్ఙన తెలంగాణ – బోధన్ మాయమాటలతో కేంద్రంలో అధికారంలో వచ్చిన బిజెపి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేసి అన్నింటిపై అధిక ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు .మంగళవారం సాలూర మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో పెట్రోల్ ,డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, ఎరువుల ధరలు పెంచి ప్రజలను నిండా మంచిందని అన్నారు. అలాగే జీఎస్టీ పేరుతో సంవత్సరానికి నెలలకు లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే రైతులకు 500 బోనస్ తో పాటు 3000 రూపాయల కనీసం మద్దతు చెల్లిస్తామని అన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాదేనని మరోసారి అన్నారు. చెరుకు రైతులకు ప్రోత్సహించి చెరుకు పండించి చెరుకు ఫ్యాక్టరీని నడిపించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ తర్వాత జరిగే పెళ్లిళ్లకు లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం అందించే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామన్నారు. గృహాలకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. టిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటేనని వారి మోసపూరిత మాటలను మునగ వద్దని అన్నారు నిరుపేదలకు పక్క ఇండ్లు, బీడీ కార్మికులకు 4000/- పింఛన్ అందిస్తామన్నారు సాలురా మంజీర పై ఎత్తిపోతల పథకం నిర్మించి రైతులకు ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు . కావున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దేశంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు .బిజెపి, టీఆర్ఎస్ పార్టీల మోసపూరిత హామీలకు మరోసారి మోసపోవద్దని అన్నారు .కార్యక్రమంలో ఉర్దూ అకాడమి చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నాయకులు మందర్న రవి, నాగేశ్వరరావు, అల్లే జనార్ధన్, అల్లె రమేష్, బుయన్ సురేష్, నరేందర్ రెడ్డి , పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »