జ్ఞాన తెలంగాణ పరకాల జనవరి 5 పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.అనంతరం నూతన ఆసుపత్రి పరిసర ప్రాంతాలను,రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదప్రజల కోసం అన్ని వసతులతో కూడిన వైద్యం ప్రతి నిరుపేదకు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.గత ప్రభుత్వ పాలకులు శంకుస్థాపనలు, ప్రచారాలకే పరిమితమయ్యారని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.