కాంగ్రెసొళ్ళు గద్దల్లా కాకుల్లా మాటల దాడి చేస్తున్నారు

ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెసొళ్ళు గద్దల్లా కాకుల్లా మాటల దాడి చేస్తున్నారు
బిజెపి మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ
జేజమ్మకు జేజెలు.. అడుగడుగునా నీరాజనాలు
షాద్ నగర్ నియోజక వర్గంలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం
మాహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం
ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెసొళ్ళు గద్దల్లా కాకుల్లా మాటల దాడి చేస్తున్నారనీ
బిజెపి మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ పరిధిలోని జిల్లేడు చౌదరిగూడెం మండలం పెద్ద ఎల్కిచర్ల, పద్మారం, చౌదరిగూడెం మండల కేంద్రంలో అరుణమ్మ ఎన్నికల ప్రచారం, రోడ్డుషో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆమె వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అందే బాబయ్య, కమ్మరి భూపాల చారి తదితర స్థానిక నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు.. అయన సీఎం స్థాయి మరిచిపోయి
మాట్లాడుతున్నారనీ కాంగ్రెస్ పార్టీ ప్రజాధరణ కోల్పోయిందనీ ఇచ్చిన హామీల అమలులో రేవంత్ పూర్తిగా విఫలం అయ్యాడనీ పేర్కోన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కానీ మోదీ అంటేనే గ్యారంటీ…
మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం అని అన్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టిస్తా అన్నారు కట్టించారనీ, ఆర్టికల్ 371 రద్దు చేసామనీ, సీఏఏ చట్టం అమల్లోకి తెచ్చామని చట్టం సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు తెచ్చామనీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామనీ రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్నారు. గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నాం, పంచాయతీలకు నిధులస్తున్నాం అన్నారు. 500 ఏళ్లుగా ఎదురు చుసిన రాములవారి మందిరం నిర్మించి ఊరురా అక్షింతలు పంపిన మోడీని మనమంతా ఆశీర్వదించాలని అన్నారు.
మోదీ దేశ వ్యాప్తంగా ఇల్లు కట్టించారు.. కానీ గత పాలకులు డబల్ బెడ్ రూమ్స్ పేరుతో మోసం చేసిందని విమర్శించారు. ఇక్కడ అరుణమ్మ గెలిస్తే పెద్ద ఎల్కిచర్ల, చౌదరిగూడెం పరిధిలోలో అర్హులందరికీ ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇక్కడ రోడ్లు వేసింది మేము, గ్రామాలకు నిధులు ఇస్తున్నది మోదీ అని పేర్కొన్నారు.
పాలమూరులోని షాద్ నగర్ చౌదరి గూడెం కు కేంద్రం నిధులు రావాలంటే ఇక్కడ అరుణమ్మ గెలవాలని అన్నారు. భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహా నాయకుడు మోదీ అని మోదీ విజనరి పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అరుణమ్మకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని
హైదరాబాద్ కంటోన్మెంట్ లో మహిళా అభ్యర్థి గెలవాలంట.. కానీ మహబూబ్ నగర్ లో అరుణమ్మ గెలవొద్దంట అనే ధోరణి సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ అరుణమ్మ ఎవ్వరికి భయపడదని, నమ్మి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చారు.
అరుణమ్మ ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపిన స్థానిక మహిళలు, బీజేపీ శ్రేణులు, పటాకుల మోతలు, జై బీజేపీ నినాదాలతో హోరేత్తిన గ్రామాలు, అడుగడుగునా నిరాజనాలు… జై బీజేపీ నినాదాలతో షాద్ నగర్ పరిధిలో బిజెపి అభ్యర్థి అరుణమ్మ ప్రచారం జోర్దార్ గా సాగుతోంది. ఈ సందర్భంగా అరుణమ్మ ప్రచార రధం పై ముందుకు సాగుతున్న బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పాలనా తీరును తనదైన శైలిలో ఎండగట్టారు అరుణమ్మ..