పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

– పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి విచారణ జరపాలి
– కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని విమర్శ
– 2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని కేసు నమోదైందన్న ఆర్ఎస్పీ
-కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :

2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని, పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి కారణాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా ఉంచిందని ఆరోపించారు.
మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని 2023 అక్టోబర్ 21న సాయంత్రం 6.30 గంటలకు మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు. అసాంఘిక శక్తులు ఉన్నాయని ఏఈఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించారు. అయినప్పటికీ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

You may also like...

Translate »