చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :

చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చేరుకొని రాములు పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, “ఆయన లేరన్న వార్త నమ్మలేకపోతున్నాను. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.అలాగే నవాబ్‌పేట్ మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు నాని యాదవ్ తండ్రి పెద్ద గొల్ల బాలయ్య మరణం పట్ల కూడా భీమ్ భరత్ సంతాపం తెలిపారు. వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, షాబాద్ సర్పంచ్ తమిల్లి రవీందర్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య, దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు సర్పంచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా నవాబ్‌పేట్ మండల అధ్యక్షులు వెంకటయ్య, ప్రభాకర్ రెడ్డి, సామ వెంకట రెడ్డి, శ్రీధర్, శేఖర్, ప్రసాద్, రాజేష్, అలాగే ఆయా గ్రామాధ్యక్షులు శేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని మరణించిన వారికి ఘన నివాళులు అర్పించారు.

You may also like...

Translate »