ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

- ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా చూడాలి
- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును 61 రెవెన్యూ శాఖ -32, ఇతర శాఖలు -29
- సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
- జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్టు 11 :
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కె. శ్రీనివాస్, డీఆర్ఓ సంగీతతో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (61) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ– 32, ఇతర శాఖలకు – 29, మొత్తం 61 దరఖస్తులు అందాయి.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


