కళాకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా


మంటి లింగయ్య నియామకం
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 18

తెలంగాణ ఉద్యమ. కళాకారుల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా మంటి లింగయ్య నియమిస్తూ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంటి లింగయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులం అనేక ధూంధాములు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి అనేక రకాలుగా నష్టపోయామని ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని ఆయన అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కళాకారులందరూ ఏకం కావలసిన అవసరం ఉందన్నారు

You may also like...

Translate »