రిటైర్డ్ న్యాయమూర్తికి స్వాగతం పలికిన సిద్దిపేట కలెక్టర్

రిటైర్డ్ న్యాయమూర్తికి స్వాగతం పలికిన సిద్దిపేట కలెక్టర్
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
శుక్రవారం రోజున సిద్దిపేటలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయవిచారణకు వెళుతూ సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆగిన రిటైర్డ్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి పినాక చంద్రఘోషను కలెక్టర్ ఎం.మనుచౌదరి కలిశారు. ఆయనకు పూలగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. న్యాయవిచారణ చేసేందుకు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు ఆయన వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.
