కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య నిర్మిస్తున్న వంతెన ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా గిర్డర్లు కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది.
రాత్రి సమయంలో జరగటం వల్ల జనసంచారం లేకపోవటంతో ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.