ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలు, కులగణన తీరుపై సీఎం వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించిన బిల్లులతో పాటు ప్రధానంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై ఖర్గేతో చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన కేంద్ర పెద్దలను కూడా కలవనున్నట్లు సమాచారం.