సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను విరమించుకోవాలి: అడ్వకేట్ సంఘం

సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను విరమించుకోవాలి: అడ్వకేట్ సంఘం
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం లోగోను మార్చడాని తీవ్రంగా ఖండిస్తున్నామని హనుమకొండ జిల్లా అడ్వకేట్ సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కోర్టు ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి లోగోను మార్చే ఆలోచనలు విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అడ్వకేట్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.