పంచాయితీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ , చేవెళ్ల:రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల, ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కార్మికుల సంఘం అధ్యక్షులు మల్కి భీమ్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం చేవెళ్ల లోని డాక్ బంగ్లా లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన సమ్మె కాలపు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రతి నెల ఒకటో తారీఖున గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు జీతాలను చెల్లించాలన్నారు. లేనియెడల భవిష్యత్తులో తీవ్రమైన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల మొదటి తారీఖున వేతనాలను చెల్లించకపోవడంతో అనేక ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. జీతాల కోసం గ్రామ కార్యదర్శులను అధికారులను అడిగితే గ్రామపంచాయతీలలో డబ్బులు లేవని కొందరు.. కొత్తగా స్పెషల్ ఆఫీసర్ సంతకాలు కాలేదని మరి కొందరు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని, ఇంకొదరు ఇలా అనేక రకాల సాకులతో కార్మికుల కడుపులను కాల్చడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని హితువు పలికారు. ప్రతి నెల జీతాలు వచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధిని, బడ్జెట్ ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల భవిష్యత్తులో తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు చౌలా పోచయ్య రవికుమార్ బంగారు రాజు సంపత్ కుమార్ గౌడ్ నరేందర్ జహంగీర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »