సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవంలో సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజ్.

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
మే 30.

ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు 5 దశాబ్దాలుగా కార్మికుల హక్కుల పరిరక్షణ ,వేతనాల కోసం జరిగిన పోరాటాల్లో సిఐటియు ముందంజలో ఉంటుందని సిఐటియు మండల కార్యదర్శి జయరాజు అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో సిఐటియు 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు మండల అధ్యక్షులు బొల్లా రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు మాట్లాడుతూ 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో సిఐటియు ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు జరిగిన 22 దేశవ్యాప్త సమ్మేళనం జయప్రదం చేయటంలో కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి ఐక్య పోరాటాలను నిర్వహించడంలో సిఐటియు పని చేసిందని వివరించారు. పాలకవర్గాలు కార్మిక హక్కులను కాలరాసే క్రమంలో హక్కుల పరిరక్షణ కోసం వేతనాలు, ప్రయోజనాలు, పని పరిస్థితుల మెరుగుదల కోసం నికరంగా పోరాడిన సంఘం సిఐటియు అన్నారు. రైతాంగ, వ్యవసాయ కూలీలతో ఐక్యతను సాధించటంతో పాటు సమస్యలను పరిష్కరించాలని ప్రతి సంవత్సరం రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి ఐక్యత దినోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. హక్కులు వేతనాలు వరకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల దోపిడీని అంతమొందించడం సిఐటియు లక్షమని ఆయన తెలిపారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగా కార్మికులకు వెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు నెలకు రూ. 26000 అమలు చేయాలని, స్కీం వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని ,పాలకులను డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో గుజ్జునూరి. యాకమ్మ ,గుజ్జునూరి.దేవేంద్ర, తమ్మడపల్లి. సుగుణ, పప్పుల. ఉమా, ఇసంపెల్లి. సోమక్క, లింగాడపు.దర్గయ్య, గుజ్జునూరి.యాకయ్య, మంగళపల్లి.వీరయ్య, గుజ్జునూరు. ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »