క్లోరిన్ గ్యాస్ లీక్… ముగ్గురికి అస్వస్థత

క్లోరిన్ గ్యాస్ లీక్… ముగ్గురికి అస్వస్థత
జ్ఞాన తెలంగాణ /భద్రాద్రి / దుమ్ముగూడెం మండలం. జూన్ 13:
భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల జంక్షన్లో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టులో గురువారం క్లోరిన్ గ్యాస్ లీక్ అవడంతో ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరూ రక్తపు వాంతులు చేసుకున్నారు. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పంప్ హౌస్ లో ఏర్పాటు చేసిన క్లోరిన్ ట్యాంక్ మారుస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారి శ్శబ్దం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.