గుండెపోటుతో మృతి చెందిన చిన్న శంకర్ పల్లి వాసి

గుండెపోటుతో మృతి చెందిన చిన్న శంకర్ పల్లి వాసి

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీ పట్టణ పరిధి చిన్న శంకర్ పల్లి లోని ఆరవ వార్డులో నివాసముండే కులకర్ణి ప్రహ్లాద్ (38) అనే వ్యక్తి మంగళవారం రాత్రి, గచ్చిబౌలి లోని ఓ హాస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న శంకర్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, చిన్న శంకర్ పల్లి లోని ప్రహ్లాద్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రహ్లాద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ప్రహ్లాద్ చాలా మంచి వ్యక్తి అని అందరితో కలిసి ఉండేవాడని తెలియజేస్తూ తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

You may also like...

Translate »