చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుసనగారి స్వామి
జ్ఞాన తెలంగాణ, (తుక్కుగూడ)
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని తుక్కుగూడ మున్సిపల్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుసనగారి స్వామి అన్నారు.రంజిత్ రెడ్డి గెలుపు కోసం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.ఆరు గ్యారంటీలతో పాటు ప్రజా సంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మహేశ్వరంలో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తున్నామని స్వామి అన్నారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తూ ప్రచారం నిర్వహించడం జరుగుతుందని స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి రాజు, కొటగళ్ల రాజ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, బాలరాజు, బాట రాజు, పాండు తదితరులు పాల్గొన్నారు.
