పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల :
చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ గారు మొయినాబాద్ మండలం కంచమోనీగూడ గ్రామానికి చెందిన సన్వల్లీ సరిత–లచ్చి రెడ్డి దంపతుల కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం అక్నపల్లి నరసింహ రెడ్డి వారి కుమార్తె వివాహ వేడుకలో కూడా పాల్గొని వధూవరులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుడుపల్లి పెంటారెడ్డి, మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, యాదయ్య, బలరాజ్ శ్రీనివాస్, మల్లారెడ్డి నక్క శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
