RSP సమక్షంలో BSP లో చేరిన DSP అధినేత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు.

RSP గారి సమక్షంలో BSP లో చేరుతున్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడి సొంత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు.
దళిత శక్తి ప్రోగ్రాం (DSP) వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రస్తుత ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు(DSP) గారి సొంత చెల్లెలు
చెరుకుపల్లి శారదా గారు నేడు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్,బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు గారి సమక్షంలో వెలది మహిళా కార్యకర్తలతో బహుజన్ సమాజ్ పార్టీ లో జాయిన్ అయ్యారు.
ఈ సందర్బంగా చెరుకుపల్లి శారదా గారు మాట్లాడుతూ దాదాపు 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకొని,డీజీపీ అయ్యే అవకాశం ఉన్న పదవిని తృణపాయంగా వదులుకొని లక్షలాది పేదల కన్నీళ్లు తుడవడానికి వచ్చిన డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తమకెంతో ఇష్టం అని,లక్షలాది పేద బిడ్డలకు ఊపిరిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గొప్ప యూనివర్సిటీ లలో చదివేలా స్ఫూర్తి నింపిన ప్రవీణ్ సార్ తో కలిసి నడవడం గొప్ప విషయం అని,ఇలాంటి నాయకుడు వంద ఏళ్లకు ఒక్కరు పుడతారని,అసలైన కాన్షిరాం వారసుడు ప్రవీణ్ కుమార్ సార్ మాత్రమే నాని,అలంటి వారిని ఈ సమాజం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు.
మహనీయుల ఆశయాలను గుండెల్లో పెట్టుకొని ఇప్పటికే బహుజన రాజ్యాధికార యాత్రలో 2 సంవత్సరాలు ఎవ్వరు చేయలేని సాహసం ఒక్క ప్రవీణ్ సార్ మాత్రమే చేసారని,ప్రతి గడపను తట్టి,వారి గుండె కొత విన్నారని వారి అడుగు జాడల్లో నడవడం తమ అదృష్టమని అన్నారు.
త్వరలో తమ కుటుంబ,రక్త సంబధీకులతో వందలాదిగా పార్టీలో చేరడానికి సిద్ధం చేస్తున్నాని త్వరలో తమ సొంత నియోజక వర్గంలో వెలది మంది తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరిని బహుజన్ సమాజ్ పార్టీలో చేర్చబోతున్నట్టు వారు తెలిపారు.